విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి- తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్.
ఆంధ్రప్రదేశ్ , గుంటూరు జిల్లా, వట్టిచేరుకూరు మండలం,గారపాడు , B.K.R జిల్లాపరిషత్ ఉన్నత పాటశాలలో పదవ తరగతి విద్యార్థులకు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యా విధానాన్ని అనుసరించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్ మాట్లాడుతూ ఈ యొక్క సమాజానికి ప్రముఖులు అయినటువంటి విద్యార్థులు ఎప్పుడైతే వారియొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని విద్యా రంగంలో, క్రీడారంగంలో ఏ విధంగా ముందుండాలి ఏవిధంగా ముందుకు వెళ్లాలి అని తెలియజేస్తూ విద్యార్థుల యొక్క ఎదుగుదలకు గల ముఖ్యమైన శ్రేష్టమైన ప్రతిష్టాత్మకమైన క్రియాశీలంగా పాటించే ఎల్.ఎస్.డబ్ల్యు ఆర్ స్కిల్స్ జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగడానికి గొప్ప గొప్ప చదువులు చదవడానికి , గొప్ప గొప్ప ఉద్యోగాలు చెయ్యడానికి మరియు సమాజాని అర్థం చేసుకోడానికి అదేవిధంగా సమాజంలో ఏ విధంగా తమ వంతు బాధ్యతను నెరవేర్చాలో నేటి సమాజంలో విద్యార్థులు ఏ విధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్లాలో తెలియజేశారు. అదేవిధంగా తెలుగు రాష్ట్ర ప్రజలు ఉన్నత చదువులు చదవడానికి , గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయడానికి ఎల్లవేళలా విద్యార్థుల భవిష్యత్తు కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ముందుండి పోరాడుతుందని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినా B.K.R జిల్లాపరిషత్ ఉన్నత పాటశాల, గారపాడు , ప్రధానోపాధ్యాయులు భాస్కర రావు గారికి , ఉపాధ్యాయులు కే.సునీత గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ యొక్క చదువు పట్ల అవగాహన సదస్సు కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థిని, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
