Breaking News

ఈనెల 14 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండోదశ ప్రజా సంగ్రామ యాత్ర...

 


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈనెల 14 నుంచి చేపట్టనున్న రెండోదశ ప్రజా సంగ్రామ యాత్ర 31 రోజుల పాటు కొనసాగుతుందని ఆ యాత్ర సమన్వయకర్త దుగ్యాల ప్రదీ్‌పకుమార్‌, తదితరులు తెలిపారు. మొత్తం 380 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుందని వివరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ప్రదీ్‌పకుమార్‌, తదితరులు మాట్లాడారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రజా సంగ్రామ యాత్రకు కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులూ హాజరవుతారు. జోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమయ్యే ప్రజా సంగ్రామ యాత్ర తొలిరోజు 4 కిలోమీటర్లు కొనసాగుతుంది. అనంతరం, మొత్తం మూడు పార్లమెంటు, పది అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో రోజుకి సగటున 13 కిలోమీటర్ల మేర ఈ యాత్ర నిర్వహిస్తారు. యాత్ర సందర్భంగా బండి సంజయ్‌ స్థానికులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటారు. ఆలంపూర్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలుతో పాటు మహేశ్వరంలో భారీ సభలు ఉంటాయి. మే 14న మహేశ్వరం నియోజకవర్గంలో జరిగే ముగింపు బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరవుతారు