Breaking News

తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్‌ విడుదల..

 


తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సు కోసం రాసే టీఎస్ లాసెట్ పరీక్షను జూలై 21వ తేదీన నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

అలాగే ఐదేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సు నిర్వహించే లాసెట్ పరీక్షను జూలై 22న, పీజీఎల్‌సెట్‌ను కూడా జూలై 22వ తేదీనే నిర్వహించనున్నారు. మరోవైపు ఐసెట్ పరీక్షను జూలై 27, 28 తేదీల్లో, జూలై 29 నుంచి ఆగష్టు 1 వరకు పీజీఈసెట్ పరీక్షను నిర్వహిస్తామని లింబాద్రి ప్రకటించారు.