Breaking News

గుంటూరులోని 'అన్న క్యాంటీన్‌'ను ప్రారంభించిన బాలకృష్ణ..

 


వైకాపా పాలకులు వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారని ప్రముఖ సినీనటుడు, తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.

గుంటూరులోని జేకేసీ రోడ్డులో తెదేపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'అన్న క్యాంటీన్‌'ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లోనూ తిరుగుబాటు వస్తోందని చెప్పారు. మరుగుదొడ్లపైనా పన్ను వేసే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వంపై ఉద్యమించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. తెదేపాను తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు.