Breaking News

ఈ నెల 23 తిరుపతి జిల్లాలో సీఎం జగన్ పర్యటన..

 


ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ నెల 23 తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం.. 11 గంటలకు తిరుపతి రూరల్‌ మండలం పేరూరు చేరుకుంటారు. 11.15 – 11.45 గంటల వరకు శ్రీ వకుళమాత ఆలయ ప్రారంభోత్సవం, పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. 12.05 గంటలకు శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు చేరుకుంటారు. అక్కడి హిల్‌టాప్‌ సెజ్‌ ఫుట్‌వేర్‌ ఇండియా లిమిటెడ్‌ పాదరక్షల తయారీ యూనిట్‌ నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటకు ఏర్పేడు మండలం వికృతమాలలో ఈఎంసీ 1 పరిధిలోని టీసీఎల్‌ పరిశ్రమ వద్దకు చేరుకుని ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపన కార్యక్రమాలకు హాజరవుతారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 3.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. సీఎం పర్యటన నిమిత్తం అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.