ఏపీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. ఏటా 8వ తరగతి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ట్యాబ్ లు ఇవ్వనున్నామని ప్రకటించారు.
వీటిని ఈ ఏడాది నుంచి ప్రారంభిస్తున్నామని.. హై స్కూళ్ళను పదో తరగతిగా అప్ గ్రేడ్ చేస్తున్నామన్నారు. ఉన్న సిబ్బందిని సర్దుబాటు చేసుకుంటామని.. అవసరమైతే రిక్రూట్ చేస్తామని ప్రకటించారు. ఫలితాలు తక్కువగా రావటానికి కారణాలు విశ్లేషిస్తామని.. మెరుగైన ఫలితాలు వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పారు. ఇంటర్ ఫలితాల్లో కూడా ర్యాంకుల ప్రకటించకూడదని ఇప్పటికే ఆదేశించామని.. ప్రతి మండలానికి ఒక కాలేజి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందనిపేర్కొన్నారు. ఈ లెక్కన ఇంకా 884 కళాశాలలు కొత్తగా ఏర్పాటు చేయాల్సి ఉంది.. వీటిని ఈ ఏడాది నుంచి ప్రారంభిస్తున్నామన్నారు బొత్స సత్యనారాయణ
Reviewed by AUTHOR
on
June 22, 2022
Rating: 5
TSLAW NEWS - The Voice of Truth