Breaking News

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన పై స్పందించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి..

 


బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు దయచేసి ఆందోళన విరమించాలని, వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసమే కొత్త డైరెక్టర్ ను నియమించినట్టు తెలిపారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ వెంకటరమణను ప్రభుత్వం బాసర విద్యార్థుల వద్దకు పంపించిందని, విద్యార్థులు ఆయనతో చర్చించాలని కోరారు. విద్యార్థుల సమస్యలను తక్కువ చేసి చూడడం తన ఉద్దేశం కాదని పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీ విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని.. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు బాసర విద్యార్థులను క్యాంపస్ నియమకాలకు సెలక్ట్ చేసుకుంటున్నా యన్నారు. అటువంటి అత్యున్నత సంస్థ ప్రతిష్టకు భంగం కలగవద్దని కోరుతున్నానన్నారు. కోవిడ్ కారణంగా రెండేండ్ల పాటు క్లాసులు సరిగ్గా జరగక, కొన్ని అంశాల పరిష్కారంలో జాప్యం జరిగి ఉండొచ్చని అన్నారు. గత కొన్నిరోజులుగా ఎండలో, వానలో మీరు కూర్చోవడం చూస్తుంటే మీ మంత్రిగానే కాదు... ఒక అమ్మగా బాధ కలిగిస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మీ ప్రభుత్వం... దయచేసి చర్చించండి అని విజ్ఞప్తి చేశారు. రాజకీయాల ఈ యూనివర్సిటీ వేదిక కావద్దన్నారు. ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరిస్తుంది అని అన్నారు.