పరమశివ పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చదరంగం(చెస్) పోటీలు.
సంగారెడ్డి జిల్లా,సదాశివపేట పట్టణంలో పరమశివ పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చదరంగం(చెస్) పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో స్వతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు కోవూరి మొగులయ్యగౌడ్ సతీమణి కోవూరి మణెమ్మ కుటుంబసభ్యులు తెలంగాణ బి సి సంక్షేమసంగమం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్ మట్లాడుతు పరమశివపిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ మెగా పిరమిడ్ నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని మరియు పనుల ప్రారంభోత్సవంకు 50 యాబై వేల రూపాయలను స్వతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు కోవూరి మొగులయ్యగౌడ్ జ్ఞాపకార్థం మెరకు విరాళం పరమశివపిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వారికి అందజేశారు. అదేవిధంగా వేదికను అలంకరించి నటువంటి పెద్దలు వారి యొక్క ముఖ్య సందేశాన్ని యువకులను దృష్టిలో ఉంచుకొని స్ఫూర్తిదాయకంగా సందేశించారు . తదనంతరం ప్రథమ బహుమతి పొందిన వారికి , ద్వితీయ బహుమతి పొందిన వారికి ,,మరియు తృతీయ బహుమతి పొందిన వారికి రిటైర్డ్ హెడ్మాస్టర్ మల్లేశం సార్ గారు ,కరాటే శంకర్ గౌడ్ గారు , బి సి సంక్షేమసంగమం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్ గారు , పట్టభద్రుల సంఘం అధ్యక్షులు విశాల్ గారు, సంగారెడ్డి జిల్లా చెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గారు, చెస్ కాంపిటేషన్ ఆర్గనైజర్ రామరాజు గారు, అభినందించి బహుమతిని అందజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో పరమశివపిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ కమిటీ సభ్యులు అశోక్ గారు, కృష్ణ గారు, వీరేశం గారు మరియు పట్టణ ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


