Breaking News

ఏడుకొండలు తానే స్వయంగా వచ్చి జబర్దస్త్ మీద వస్తున్న ఆరోపణలపై క్లారిటీ

 


బుల్లితెర మీద ప్రసారమయ్యే షో లలో జబర్దస్త్ (jabardasth)ముందు ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో ఈ షో నుంచి చాలామంది బయటికి వస్తున్నారు.  అయితే ఈ షో నుంచి వచ్చిన కిరాక్ ఆర్ పి జబర్దస్త్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్పి చేసిన వ్యాఖ్యలు అబద్ధమని షేకింగ్ శేషు,రాం ప్రసాద్,హైపర్ ఆది క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే చాలాకాలంగా జబర్దస్త్ షో కి మేనేజర్ గా పనిచేస్తున్న ఏడుకొండలు తానే స్వయంగా వచ్చి జబర్దస్త్ మీద వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇస్తానని చెప్పి ఓ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చాడు.  జబర్దస్త్ మీద వస్తున్న రూమర్స్ అన్నింటినీ కొట్టిపారేశాడు.ఆర్పీ చేసిన వ్యాఖ్యల్లో ఒక్కటి కూడా నిజం లేదంటూ తెలియజేశాడు. అంతేకాకుండా సుడిగాలి సుధీర్ (sudheer)బండారం మొత్తం బయట పెట్టాడు. సుధీర్ కి లైఫ్ ఇచ్చింది నేనే కానీ నా ఫోనే లిఫ్ట్ చేయడం మానేశాడు. నాలుగు డబ్బులు, నలుగురు ఫ్యాన్స్ ఉంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది మర్చిపోతారు. నేను ఓ సారి మాల్ ఓపెనింగ్ కి రమ్మని సుధీర్ ని అడిగితే అతను మేనేజర్ తో మాట్లాడు అని చెప్పాడు అంటూ ఏడుకొండలు చెప్పారు.  మరి సుదీర్ ఎందుకు జబర్దస్త్ నుంచి బయటికి వచ్చాడో మీరు తెలుసుకున్నారా? అని యాంకర్ అడగగా.. అసలు అతను నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పాడు. అంతే కాదు లైవ్ లో కూడా ఫోన్ చేశాడు. ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో ఒక సినిమాలో బిజీగా ఉన్నాము అని చెబుతాడు. కానీ అతను చేసిన ఏ సినిమా హిట్ అయిందో చెప్పండి అంటూ ఏడుకొండలు(adukondalu) చాలా ఫైర్ అయ్యారు. ప్రస్తుతం జబర్దస్త్ మేనేజర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. మరి దీనిపై సుడిగాలి సుధీర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.