ఇప్పటి వరకు ఒక లెక్క. ఇప్పటి నుంచి మరో లెక్క : కేటీఆర్
ఇప్పటి వరకు ఒక లెక్క. ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లుగా రాజకీయ పోరాటం ఉంటుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాజకీయంగా పూర్తిగా అఫిన్సివ్ గా వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. మొన్నటి సర్వే బీజేపీదని..నిన్నటి సర్వే కాంగ్రెస్ దని కేసీఆర్ పేర్కొన్నారు. కానీ, రెండు సర్వేల్లోనూ టీఆర్ఎస్ గెలుస్తుందని వచ్చిందని వివరించారు. ప్రధాని మోదీ గతంలో చాలా హామీలు ఇచ్చారని.. చాలా మాట్లాడారంటూ చెప్పుకొచ్చారు. రూపాయి విలువ తగ్గటం పైరా కామెంట్ చేసారని గుర్తు చేసారు. By Chaitanya రేవంత్ రెండు సార్లు ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇప్పటికే రెండు సార్లు రాజకీయ సన్యాసం అన్నారని, అయితే లగడ పాటిని ఈ అంశంలో మెచ్చుకోవాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తోందని ప్రత్యర్ధులు కూడా ఒప్పుకుంటున్నారని కేటీఆర్ చెప్పారు. తాము చేయించిన సర్వే ప్రకారం తమకు 90 సీట్లు పైగా వస్తాయని వెల్లడించారు. కాంగ్రెస్ - బీజేపీ అధ్యక్షులు సైతం టీఆర్ఎస్ గెలుస్తుందనే విషయాన్ని అంగీకరిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ హవా రాష్ట్ర మొత్తంగా ఉందన్నారు. కాంగ్రెస్ - బీజేపీ పార్టీలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చేసే స్థాయిలో లేవన్నారు. కొన్ని ప్రాంతాల్లో షర్మిల పార్టీ సైతం కొన్ని ప్రాంతాల్లో షర్మిల పార్టీ సైతం ఉందని చెప్పుకొచ్చారు. బీహార్ విభజనకు ముందుకు రాష్ట్రం మొత్తం ఆర్జేడీ ఉండేదన్నారు. జార్ఖండ్ ఏర్పాటు అయిన తరువాత ఆ రాష్ట్రంలో ఆర్జేడీ లేకుండా పోయిందన్నారు. ప్రశాంత్ కిషోర్ ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా కొన్ని నిర్ణయాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఎనిమిదేళ్లుగా సీఎంగా చేసిన కేసీఆర్ మరోసారి సీఎం అవుతారంటూ సర్వేలు చెబుతున్నాయని వివరించారు. దక్షిణ భారతం లో కెసిఆర్ హ్యాట్రిక్ విజయం సాధించబోతున్న మొదటి సీఎంగా నిలుస్తారన్నారు. బలమైన నేతకే టిక్కెట్లు ఇస్తాం పార్టీ లో అంతర్గత విభేదాలు ... పార్టీ బలంగా ఉందనడానికి నిదర్శనంగా పేర్కొన్నారు. పార్టీ లు మారడం సర్వ సాధారణమని వ్యాఖ్యానించారు. కలిపి పార్టీ నీ నడిపించక పోతే ఇబ్బందులు తప్పవని, అందుకే తాను పార్టీ లో చాలా మంది నేతలను కలుస్తానని చెప్పుకొచ్చారు. ఈటల వస్తె తీసుకుంటామని అనేది ఊహాజనితమంటూ కేటీఆర్ కొట్టిపారేసారు. క్షేత్ర స్థాయిలో తమ పార్టీ లోని అత్యంత బలమైన నేత కు టికెట్లు ఇస్తామని కేటీఆర్ వివరించారు.
