యాదగిరిగుట్టకు 100 మినీ బస్సులు
యాదగిరిగుట్టకు 100 మినీ బస్సులు అందుబాటులో ఉన్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ ఉప్పల్ సర్కిల్ నుంచి మినీ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. జేబీఎస్ నుంచి యాదగిరిగుట్టకు రూ.100 చార్జ్ చేస్తున్నట్టు తెలిపారు. ఉప్పల్ నుంచి రూ.75 రూపాయలని వెల్లడించారు. ప్రతి రోజూ 104 సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. ఇవే కాకుండా ఇతర జిల్లాల నుంచి ప్రత్యేక యాదాద్రి బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రైవేట్ వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం సాఫీగా సాగుతుందని సజ్జనార్ పేర్కొన్నారు.
