Breaking News

ఏపీలో విద్యుత్‌ చార్జీల మోత..

 


ఏపీలో విద్యుత్‌ చార్జీల బాదుడే బాదుడు మొదలయింది. వినియోగదారుల నుంచి ఈ ఏడాది 4,400 కోట్ల వసూళ్లు చేయనున్నారు. కోటి 70 లక్షల మందిపై విద్యుత్‌ చార్జీల బాదుడు ప్రభావం పడనుంది. వివిధ కేటగిరీల కింద 1400 కోట్ల రూపాయల భారం పడుతోంది. 75 యూనిట్లలోపు వాడే వారే దాదాపు 65 లక్షల మంది ఉన్నారు. వీరి నుంచి మూడేళ్లలో ట్రూఅప్‌ చార్జీల పేరుతో 3 వేల కోట్లు వసూలుకు ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. 2014 నుంచి 2019 వరకు సర్దుబాటు చార్జీల పేరుతో వసూళ్లు చేయనున్నారు. ఏప్రిల్‌ నుంచి ఈ టారీఫ్‌ వసూళ్లు అమల్లోకి రానున్నాయి. ఆగస్ట్‌ నుంచి ట్రూఅప్‌ చార్జీల బాదుడు మొదలు కానుంది. ఏపీలో ఇప్పటికే ఏడుసార్లు విద్యుత్‌ చార్జీలను పెంచారు.