Breaking News

ఐపీఎల్‌-2022 సీజన్‌ షురూ..

 


క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్‌-2022 సీజన్‌ మొదలైంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌  కోల్‌కతా నైట్‌ రైడర్స్‌  జట్ల మధ్య మొదటి మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నైను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కాగా గత సీజన్‌ ఫైనల్లో కూడా కోల్‌కతా- చెన్నై జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ధోని నేతృత్వంలోని సీఎస్కే ఐదోసారి టైటిల్‌ను గెల్చుకుంది. మరి ఈ మ్యాచ్‌లోనూ చెన్నై అదే జోరు కొనసాగిస్తుందా.? కోల్‌కతా ప్రతీకారం తీర్చుకుంటుందా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.


చెన్నై ప్లేయింగ్ ఎలెవన్.. చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా(కెప్టెన్), శివమ్ దూబే, ఎంఎస్ ధోని(కీపర్), డ్వేన్ బ్రావో, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, తుషార్ దేశ్‌పాండే


కోల్‌కతా ప్లేయింగ్ ఎలెవన్.. కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్(కీపర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, షెల్డన్ జాక్సన్, ఉమేష్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి