పండక్కి ‘సర్కారువారి పాట’ సినిమా నుండి మూడో పాట..?
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు పరశురామ్ కలయికలో వస్తున్న మొదటి చిత్రం ‘సర్కారువారి పాట’. జీయమ్బీ, మైత్రీ మూవీ క్రియేషన్స్, 14 ప్లస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. ప్యాచ్ వర్క్ మినహా మిగతా పనులన్నీ పూర్తయ్యాయని సమాచారం. మే 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ ‘కళావతి’, ‘పెన్నీ’ సాంగ్స్ విడుదలయ్యాయి. వీటికి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ నేపథ్యంలో ‘సర్కారు వారి పాట’ చిత్రంలోని మూడో సింగిల్ కు కూడా ముహూర్తం ఖాయం చేశారని వార్తలొస్తున్నాయి. ఉగాది కానుకగా ఆ సింగిల్‌ను వదలాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట.
మరి ఉగాది రోజున విడుదలయ్యేది సింగిలా? లేక ట్రైలరా అన్నది సస్పెన్స్ గా మారింది. అయితే సినిమా విడుదలకు ఇంకా చాలా టైముంది కాబట్టి.. అభిమానుల్ని ఆకట్టుకొనే రేంజ్ లో ట్రైలర్ కట్ చేయాలి కాబట్టి.. దానికి మరింత టైమ్ పడుతుందని అంటున్నారు. ఏదేమైనా.. ఇప్పటి వరకూ విడుదలైన రెండు సింగిల్స్ ‘సర్కారువారి పాట’ చిత్రానికి మరింతగా హైపు తెచ్చిపెట్టాయని చెప్పాలి. అందుకే ఆ ఊపును కంటిన్యూ చేయాలంటే.. మరో సింగిల్ ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మరి ‘సర్కారువారి పాట’ నుంచి ఈ సారి విడుదలయ్యే సింగిల్ ఇంకే రేంజ్ లో ఉంటుందో చూడాలి.
