నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ టీజర్ విడుదల..
యూత్ స్టార్ నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మాచర్ల నియోజకవర్గం'. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ వచ్చింది. నేడు (మార్చి 30) నితిన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెష్ తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో నితిన్ తాజా చిత్రం 'మాచర్ల నియోజకవర్గం' నుంచి ఫస్ట్ అటాక్ అంటు ఫస్ట్ గ్లింప్స్ టీజర్‌ను వదిలింది చిత్రబృందం. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తాజాగా వదిలిన టీజర్ చూస్తేనే అర్థమవుతోంది.
నితిన్ గతంలో ఎప్పుడూ కనిపించని ఓ కొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు దర్శకుడు రాజశేఖర్ రెడ్డి కాగా, కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మిస్తున్నారు. జూలై 8న భారీ స్థాయిలో ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నారు.
