Breaking News

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు హతం...

 


జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా.. జమ్మూలోని శ్రీనగర్‌లోని రైనావారి ప్రాంతంలో బుధవారం అర్థరాత్రి భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి.


భద్రతా బలగాల ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. కాగా.. శ్రీనగర్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఇద్దరూ లష్కరే తోయిబా / టిఆర్‌ఎఫ్‌కి చెందిన స్థానిక ఉగ్రవాదులని ఐజిపి కశ్మీర్ విజయ్ కుమార్ వెల్లడించారు. ఇటీవల జరిగిన పౌర హత్యలతోపాటు పలు ఉగ్రవాద నేరాలలో విరిద్దరి ప్రమేయం కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా.. రైనావారి ప్రాంతంలో ఇంకా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.