మెగాస్టార్ ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్..?
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఆచార్య.. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తీ చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది.ఈ సినిమా నుంచి ఇప్పటివరకు బయటకు వచ్చిన అన్నీ కూడా సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి..
ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పుడూ విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తనదైన మార్క్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి..
తండ్రి, కొడుకులు ఇద్దరూ ఈ సినిమాలో కనిపిస్తుండడంతో మెగా ఫ్యాన్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది..చివరికి వేసవి కానుకగా ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.విడుదల కు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో సినిమా ప్రమోషన్స్ చిత్రబృందం మొదలు పెట్టారు.ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేయగా.. ట్రైలర్, భలే భలే బంజారా పాటలు ఆ అంచనాలను రెట్టింపు చేశాయి.. ఇప్పుడు చిత్ర ప్రిరిలిజ్ ఈవెంట్ ను గ్రాండ్ కు నిర్వహించేందుకు మేకర్స్ ప్లాను చేశారు.
తాజాగా ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మొదటగా ఈ ఈవెంట్ కు ఏపీ సీఎం జగన్ వస్తారని అందరు అనుకున్నారు..కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను హైదరాబాద్‌కు షిఫ్ట్ చేశారని, అన్న కోసం తమ్ముడు వస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు డైరెక్టర్ రాజమౌళి తో పాటు మరి కొందరు ప్రముఖులు కూడా రానున్నారని సమాచారం.ప్రీరిలీజ్ వేడుకకు పవన్ కళ్యాణ్ వస్తే.. ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌లను చూడటం మా అదృష్టం అని మెగా ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు
