Breaking News

యశ్ - ప్రభాస్ కలయికలో సినిమా..?

 

కేజీయఫ్‌ సెన్సేషన్‌ యష్‌నీ, పాన్ రేంజ్‌ ఆర్టిస్ట్ ప్రభాస్‌నీ లింకప్‌ చేస్తూ సినిమా రావాలనే డిమాండ్సూ పెరుగుతున్నాయి. డిమాండ్స్ మాత్రమే కాదు… ఫ్యాన్స్ చేస్తున్న ఈ వైరల్ డిస్కషన్‌ వాస్తవంలోకి వచ్చే వీలుందని కూడా కొందరు అంటున్నారు. విధికీ, ప్రేమకీ జరిగిన వింత యుద్ధంలో విధిని ఓడించి గెలిచిన విక్రమాదిత్యగా రాధేశ్యామ్‌లో అలరించారు ప్రభాస్‌. ఇక 2023 సంక్రాంతికి ఆదిపురుష్‌గా మన ముందుకు రాబోతున్నారు మన డార్లింగ్. ఇక ఆ తరువాత సలార్‌ సినిమా రిలీజ్‌ని లైన్‌లో పెడతారు డార్లింగ్‌. ఇదీ ప్రభాస్‌ ఫిల్మీ లైనప్‌కా కహానీ.


ఇక చాప్టర్‌ టూ సూపర్‌ సక్సెస్‌ కావడంతో గట్టి హై మీద ఉన్నారు యష్‌. నార్త్‌లో హిందీ ఫస్ట్ డే కలెక్షన్లను క్రాస్‌ చేయడంతో మస్తు మజాను ఎంజాయ్‌ చేస్తున్నారు. అటు ప్రభాస్‌, ఇటు యష్‌.. ఇద్దరూ ప్రశాంత్‌ నీల్‌ కెప్టెన్సీలో పనిచేసిన వారే. అందుకే వీరిద్దరినీ కలిపి ప్రశాంత్‌ ఓ మల్టీస్టారర్‌ చేస్తే చూడాలని ఉందంటున్నారు ఫ్యాన్స్. ఆ కథ కూడా కేజీయఫ్‌, సలార్‌ల మిక్సింగ్‌గా ఉండాలన్నది ఫ్యాన్స్ నుంచి అందుతున్న కోరిక. పాన్ ఇండియా రేంజ్‌లో ఫాలోయర్స్ తెచ్చుకున్న ఇద్దరు హీరోలు, కేజీయఫ్‌ ప్లస్‌ సలార్‌ కథల కొనసాగింపుగా సిద్ధమైన కథ.. ఊహించుకుంటేనే ఇంకో రేంజ్‌లో ఉంటుందన్నది డార్లింగ్‌ స్టార్‌, రాకింగ్‌ స్టార్‌ ఫ్యాన్స్ చెబుతున్న మాట. ఇది జరిగినా, జరక్కపోయినా ఈ ఊహ మాత్రం అదుర్స్ అంటూ సోషల్‌ మీడియా మోతెక్కిపోతోంది