యువత దేశ భక్తి భావంతో ముందుకు మెదలాలి- తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..
హైదరాబాద్: బిసి సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో యువత దేశ భక్తి భావంతో మెదిలితే భావితరాలు బాగుంటాయి అన్నది చరిత్రాత్మకంగా విశ్లేషణాత్మకంగా ఆచరించదగ్గ విషయం అని తెలియజేశారు. యువత అభివృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటీకరణ యాజమాన్యాలు సహకరించి వారి యొక్క విద్యార్హతలకు తగ్గా ఉపాధిని కల్పించి సమాజంలో స్వతంత్రులుగా జీవించే ఈ విధంగా వారి యొక్క అభివృద్ధి నీ కోరే బాధ్యత ఈ సమాజంలో ప్రతిఒక్కరిదీ అని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ మనం బాగుంటే మన దేశం బాగుంటుంది, మన దేశం బాగుంటే మన దేశ ప్రజలు బాగుంటారని తెలియజేస్తూ ప్రతి ఒక్క యువతీ యువకుడు దేశ భక్తి భావనతో ప్రతినిత్యం ఆచరణాత్మకంగా పరిశీలనాత్మకముగా ఉండి సమాజంలో మెదులుతూ ఉన్నటువంటి అసమానతలను రూపుమాపి స్వతంత్రులై భావితరాలకు బంగారు బాటను చూపించ దగ్గ వాళ్లుగా సామాజిక బాధ్యత వహించి వెనుకడుగు వేయకుండా నిరంతరం పోరాడుతూ ఉండాలని తెలంగాణ యువతకు, ప్రజలకు, ఉద్యోగ సంఘాలకు, ఉద్యమకారులకు, ప్రజా సంఘాలకు విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా హత్నూర మండల్ అధ్యక్షులు పి.చంద్ర గౌడ్, అడ్వకేట్ ఎర్ర.భగవంతరావు, ఆర్ సాయికుమార్,శ్రీకాంత్ మరియు బీసీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
