శ్రీలంకకు భారత్ అదనపు సాయం..
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పొరుగుదేశం శ్రీలంకకు భారత్ అదనపు సాయాన్ని ప్రకటించింది. ఆయిల్ కొనుగోలు కోసం అదనంగా 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ.3800 కోట్లు) అందించనుందని శ్రీలంక విదేశాంగ మంత్రి జీఎల్ పిరిస్ వెల్లడించారు. ఆర్థిక సహకారంలో భాగంగా బంగ్లాదేశ్ ఇదివరకు ప్రకటించిన 450 మిలియన్ డాలర్ల సాయం కాస్త ఆలస్యంగా అందనుందని ఆయన వివరించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రకటించిన సాయం అందడానికి ఆరు నెల సమయం పడుతుందని, దశలవారీగా ఈ సాయం అందుతుందని తెలిపారు. దేశ ప్రజలకు నిత్యావసరాలను సప్లయ్ చేసేందుకు నిధులను అన్వేషించాల్సి ఉందని పిరిస్ వివరించారు
