Breaking News

ఏపీలోని విద్యార్థులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..




 ఏపీలోని విద్యార్థులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న వసతి దీవెన రెండో విడత సాయాన్ని సీఎం జగన్‌  విడుదల చేయనున్నారు.

నంద్యాలలో జరిగే బహిరంగ సభలో 10.68 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో బటన్ నొక్కి రూ.1,024 కోట్లను జమ చేయనున్నారు. కాలేజీల్లో జవాబుదారీతనం పెరిగేలా, విద్యార్థుల తల్లులకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ.. నేరుగా వారి ఖాతాల్లోనే ప్రభుత్వం నగదు జమ చేస్తోంది. ఉన్నత విద్య చదువుతున్న పేద విద్యార్థులకు సాయంగా నిలబడేందుకు రాష్ట్ర ప్రభుత్వం వసతి దీవెన పథకానికి శ్రీకారం చుట్టింది. పేదరికం కారణంగా ఏ విద్యార్థీ ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఆలోచనతోనే వారి భోజన, వసతి, రవాణా ఖర్చులను చెల్లిస్తుంది. ఈ స్కీమ్ కింద ఏటా రెండు విడతల్లో ఐటీఐ(ITI) విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్‌, వైద్య, తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చుల కింద ప్రభుత్వం ఇస్తుంది. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 10,68,150 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది.