కేసీఆర్ ద్రోహం చేస్తున్నాడు అని మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్...
టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.. ఇక్కడి నీటిని స్థానిక ప్రజలకు ఇవ్వకుండా కేసీఆర్ ద్రోహం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని ధ్వజమెత్తారు. హుజురాబాద్ ఎన్నికల తర్వాత కేసీఆర్ అయోమయంలో పడ్డారని.. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
