బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు..
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్లు అందరు తమ మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్, హిందీ మూవీస్ అంటూ తమ మార్కెట్ ను ప్రపంచ వ్యాప్తంగా పెంచుకుంటున్నారు. కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ఇప్పటిదాకా ఆ దిశగా ఆలోచించని అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అనే చెప్పాలి. ఇప్పటివరకు హిందీ సినిమాల వైపు కన్నెత్తికూడా చూడని మహేష్ త్వరలో హిందీ చేయబోతున్నాడా..? బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా..? అంటే నిజమే అన్న మాట కొందరి నోట వినిపిస్తున్నా.. మహేష్ అందుకు సంసిద్ధంగా లేడు అన్న మాట మరికొందరు నోట వినిపిస్తుంది. అయితే మహేష్ బాలీవుడ్ ఎంట్రీకి కోసం బడా నిర్మాతలు పోటీ పడుతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఎన్నో ఏళ్లుగా హిందీ చిత్రాల దర్శకుడు సూరజ్ భర్జత్య.. మహేష్ తో ఓ సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది.
