ట్రూకాలర్ యూజర్లకు భారీ షాక్..
గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే వారికి టెక్ దిగ్గజం గూగుల్ పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే. మే 11 నుంచి గూగుల్ స్మార్ట్ ఫోన్లలో కాల్ రికార్డింగ్ ఫీచర్ పని చేయదని కుండ బద్దలు కొట్టింది.
కావున ఇక థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవడం వేస్ట్ అని ఆండ్రాయిడ్ వినియోగదారులు ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్లలో మనకు కనిపించే థర్డ్ పార్టీ యాప్ ట్రూ కాలర్. మనకు ఎవరు కాల్ చేసారా అని తెలుసుకోవడానికి ఈ యాప్ చాలా బాగా వర్క్ చేస్తుంది. కాబట్టే చాలా మంది తమ ఫోన్లలో ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుంటున్నారు. కానీ అటు తర్వాత కొద్ది రోజులకు ట్రూ కాలర్ యాప్ కూడా కాల్ రికార్డింగ్ ఫీచర్ ను తీసుకోవచ్చు.
ట్రూ కాలర్ యాప్ వాడుతున్న అనేక మంది వినియోగదారుల కోరిక మేరకు ఈ కాల్ రికార్డింగ్ ఫీచర్ ను తీసుకొచ్చినట్లు ట్రూ కాలర్ వర్గాలు తెలిపాయి. ఈ ఫీచర్ ను కస్టమర్లకు ఉచితంగా అందజేస్తున్నట్లు కూడా ప్రకటించాయి. కానీ ప్రస్తుతం గూగుల్ తీసుకున్న నిర్ణయంతో ట్రూ కాలర్ కూడా తమ యాప్ లో ఉన్న కాల్ రికార్డింగ్ ఫీచర్ ను నిలిపివేయాలని చూస్తోంది. గూగుల్ వినియోగదారుల వ్యక్తిగత ప్రైవసీ కోసం ఈ నిర్ణయం తీసుకుంది కావున ఈ నిర్ణయాన్ని తాము కూడా గౌరవిస్తామని ట్రూ కాలర్ తెలియజేసింది.
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ఈ రికార్డింగ్ ఫీచర్ పని చేయదని చెప్పినప్పటికీ.. కొన్ని ఫోన్లలో ఈ ఫీచర్ పని చేస్తుందని గూగుల్ ప్రకటించింది. షావోమీ, రియల్ మీ, ఒప్పో వంటి కొన్ని రకాల స్మార్ట్ ఫోన్లలో ఇన్ బుల్ట్ గా రికార్డింగ్ ఫీచర్ వస్తోంది. ఇలా ఇన్ బుల్ట్ గా రికార్డింగ్ ఫీచర్ వచ్చిన ఫోన్లలో రికార్డింగ్ ఫీచర్ కు ఎటువంటి ఢోకా లేదని తెలుస్తోంది.
Reviewed by AUTHOR
on
April 22, 2022
Rating: 5
