ఎన్టీఆర్ కి జోడీగా శ్రీనిధి శెట్టి..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ సక్సెస్ తో పాన్ ఇండియా రేంజులో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఎన్టీఆర్ తన తదుపరి సినిమాగా కొరటాల శివ తో పాన్ ఇండియా సినిమా చెయబోతున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుంది. ఈ సినిమా జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే కే జి ఎఫ్ సినిమాలతో most wanted గా మారాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది. అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా కే జి ఎఫ్ సినిమాలలో నటించిన శ్రీనిధి శెట్టి తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రశాంత్ నీల్ శ్రీనిధి శెట్టి ని
సెంటిమెంటుగా భావిస్తున్నాడట. అందుకని ఆ హీరోయిన్ ని మరోసారి తీసుకోవాలని ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి
