డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్‌లపై ఆర్బీఐ కొత్త నిబంధనలు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్‌లను నియంత్రించే నిబంధనలను సవరించింది. ముందస్తు అనుమతి లేకుండా కస్టమర్ల కార్డులను జారీ చేసినందుకు లేదా అప్‌గ్రేడ్ చేసినందుకు బ్యాంకులకు జరిమానాలు విధించబడతాయి.
కొత్త ఆదేశాలు జూలై 01, 2022 నుండి అమలులోకి వస్తాయి మరియు అన్ని షెడ్యూల్డ్ బ్యాంక్‌లు మరియు ఎన్ బి ఎఫ్ సి లకు వర్తిస్తాయి.
రూ. 100 కోట్లు మరియు అంతకంటే ఎక్కువ నికర విలువ కలిగిన బ్యాంకులు క్రెడిట్ కార్డ్ వ్యాపారాన్ని స్వతంత్రంగా లేదా ఇతర కార్డ్ జారీ చేసే బ్యాంకులు/ ఎన్ బి ఎఫ్ సి లతో టై-అప్ ఏర్పాటుతో చేపట్టేందుకు అనుమతించబడతాయి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు కనీస నికర విలువ రూ. 100 కోట్లు మరియు కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్‌తో కూడా ఆర్ బిఐ ఆమోదం తర్వాత క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయవచ్చు.
కార్డ్‌లను దుర్వినియోగం చేయడం వల్ల ఉత్పన్నమయ్యే ఏదైనా నష్టానికి కార్డ్ జారీ చేసే వ్యక్తి మాత్రమే బాధ్యత వహించాలని మరియు ఎవరి పేరుతో కార్డు జారీ చేయబడిందో దానికి వారు బాధ్యత వహించరని ఆర్ బీఐ నొక్కి చెప్పింది. "కార్డ్ జారీ చేసేవారు క్రెడిట్ కార్డ్‌ను యాక్టివేట్ చేయడానికి కార్డ్ హోల్డర్ నుండి వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) ఆధారిత సమ్మతిని కోరుకుంటారు. ఒకవేళ అది జారీ చేసిన తేదీ నుండి 30 రోజులకు మించి కస్టమర్ యాక్టివేట్ చేయకపోతే ధృవీకరణ కోరిన తేదీ నుండి ఏడు పని దినాలలో కస్టమర్‌కు ఎటువంటి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ ఖాతాను మూసివేస్తారని ఆర్ బి ఐ తెలిపింది. కార్డ్ యాక్టివేషన్‌కు ముందు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలతో ఎలాంటి సమాచారాన్నిబ్యాంకులు పంచుకోరాదు. కార్డ్-జారీ చేసేవారి ప్రతినిధులు ఉదయం 10 నుండి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే కస్టమర్‌లను సంప్రదించవలసి వుంటుంది. బ్యాంకులు క్రెడిట్ కార్డ్‌ల క్లోజింగ్ కోసం అభ్యర్థనను గౌరవించవలసి ఉంటుంది. క్లోజింగ్ విషయాన్ని కస్టమర్‌కు వెంటనే ఈమెయిల్, ఎస్ఎంఎస్ మొదలైన వాటి ద్వారా తెలియజేయాలి. కస్టమర్‌లకు హెల్ప్‌లైన్, ఇమెయిల్-ఐడి, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ద్వారా తెలియజేయాలి.
