ప్రగతి భవన్ జనహితలో శుభకృత్ ఘనంగా ఉగాది వేడుకలు
ప్రగతి భవన్ జనహితలో శుభకృత్ ఉగాది వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. ఉదయం 10:30 గంటలకు తెలుగు నూతన సంవత్సరం శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రారంభంకానున్నాయి. వేదపండితుల ఆశీర్వచనం అనంతరం బాచుపల్లి సంతోష్ కుమార్ శర్మ చే పంచాంగ పఠనం జరుగనుంది. వేదపండితులకు ఉగాది పురస్కారాలు అందచేసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ సందేశం ఇవ్వనున్నారు. సాయంత్రం 6:30గంటలకు రవీంద్ర భారతిలో కవిసమ్మేళనం జరుగనుంది. ఉగాది ఉత్సవాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సహా ఇతర ప్రజాప్రతినిధులు, హైదరాబాద్‌లోని కార్పొరేటర్లకు ఆహ్వానం అందింది.
