Breaking News

వరంగల్‌ ఎంజీఎంలో ఎలుకలు కొరుక్కుతిన్న బాధితుడు శ్రీనివాస్‌ మృతి...

 


వరంగల్‌ ఎంజీఎంలో ఎలుకలు కొరుక్కుతిన్న ఘటనలో విషాదం జరిగింది. బాధితుడు శ్రీనివాస్‌ హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వారం క్రితం కిడ్నీ సంబంధిత వ్యాధితో ఎంజీఎంలో చేరాడు శ్రీనివాస్‌. అక్కడి అధికారులు, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో శ్రీనివాస్‌ను ఎలుకలు కొరుక్కుతినడంతో తీవ్రరక్తస్రావం అయ్యింది. దీంతో ఉన్నతాధికారులు మెరుగైన వైద్యం కోసం శ్రీనివాస్‌ను నిన్న (ఏప్రిల్‌1) హైదరాబాద్‌కు తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. కానీ చికిత్సకు సహకరించిక పోవడంతో అర్ధరాత్రి 12 గంటల సమయంలో శ్రీనివాస్‌ మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో మృతుని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.