Breaking News

విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన దర్శకుడు శ్రీనువైట్ల భార్య.!

 


ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల గత కొంతకాలంగా సరైన సినిమాలు లేక డీలా పడిన విషయం విదితమే. మంచు విష్ణుతో ఓ సినిమా చేయడానికి శ్రీను వైట్ల ప్రయత్నిస్తున్నాడు.  అయితే, ఆ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కేలా లేదు. ఒకప్పుడు శ్రీను వైట్ల అంటే స్టార్ డైరెక్టర్. తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే దర్శకుడిగానూ ఎదిగాడు. అయితే, మూస సినిమాల కారణంగా శ్రీను వైట్ల బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ చవిచూడాల్సి వచ్చింది.  ఇక, ఇప్పుడు శ్రీను వైట్ల సినిమాలతో సంబంధం లేని ఓ వ్యవహారానికి సంబంధించి వార్తల్లోకెక్కాడు. అదీ అతని కుటుంబ వ్యవహారం కావడం గమనార్హం.  Sreenu Vaitla Divorce With Roopa Vaitla విడాకులెందుకు.? శ్రీను వైట్ల సినిమాలకు ఆయన భార్య రూప వైట్ల డిజైనర్‌గా పనిచేసేవారు. వారిద్దరిదీ అన్యోన్య దాంపత్యం. అయితే, అనూహ్యంగా సంసార జీవితంలో తలెత్తిన విభేదాల కారణంగా, ఇద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగేళ్ళుగా ఇద్దరూ విడిగానే వుంటున్నారట.  తాజాగా, రూపా వైట్ల, శ్రీను వైట్లతో విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. బంధువులు, సన్నిహితులు రాజీ చేసేందుకు ప్రయత్నించినా, ఆ ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో, విడాకుల దిశగా ఇద్దరూ మూవ్ అవ్వాల్సి వచ్చిందని అంటున్నారు. నాంపల్లి న్యాయస్థానంలో రూప వైట్ల విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.