ప్రైవేటు సెక్యురిటీ గార్డు భారీగా నగదును పొగొట్టుకున్నాడు
భారత మాజీ క్రికెటర్, స్టార్ బ్యాట్స్ మెన్ సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar) ప్రైవేటు సెక్యురిటీ గార్డు భారీగా నగదును పొగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 32 ఏళ్ల వ్యక్తి ఈ మధ్యనే నిశ్చితార్థం చేసుకున్నాడు. అయితే.. అతనికి కొంత డబ్బుల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే.. ఒక మోసగాడి జూలై 13 ఉదయం 10 గంటలకు కాల్ వచ్చింది. తాము.. కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నట్లు తెలిపారు. సెక్యురిటీ సిబ్బందితో... తాను కోటాక్ లో ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగినని పరిచయం చేసుకున్నాడు. పాపం.. ఆన్ లైన్ మోసగాడని (Cyber fraud) పసిగట్టలేకపోయాడు. అప్పటికే అతనికి డబ్బులు అవసరం ఉండటంతో లోన్ కావాలని అంగీకరించాడు. దీంతో సైబర్ నేరగాడు.. బాధితుడి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వివరాలను వాట్సాప్ నంబర్‌లో పంపమని అడిగాడు. దీని ప్రకారం, ఫిర్యాదుదారుడు అడిగిన వివరాలన్నింటినీ పంపించాడు. అయితే, తాము.. తొలుత మోసగాళ్లు అతని ఖాతాకు పదివేలను పంపించారు. ఆ తర్వాత.. ఒక ఓటీపి వస్తుందని చెప్పమన్నారు. డబ్బులు జమ కావడంతో అతను నిజమే అనుకొని ఓటీపి చెప్పాడు. దీంతో అతని అకౌంట్ లో ఉన్న రూ. 18,200 రూపాయలను నేరగాళ్లు మాయం చేశారు. అదే విధంగా.. మరుసటి రోజున మళ్లి ఫోన్ చేశారు. మోసగాడు మరుసటి రోజు.. బాధితుడికి మళ్లీ కాల్ చేసి, ప్రాసెసింగ్ ఫీజుగా రూ. 10,000 పంపాలని అడిగాడు. ఆపై అతని ఖాతాకు రూ. 1.50 లక్షలు రుణం పంపిణీ చేయబడుతుందని అన్నారు. దీంతో తాను మోసాపోయానని గ్రహించాడు. వెంటనే బాంద్రా పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ మోసం (Online fraud) గురించి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా ఒడిశాలో (Odisha) అమానవీయ ఘటన వెలుగులోనికి వచ్చింది. ఢెంకనాల్ జిల్లాలోని చంద్రశేఖర్‌పూర్ గ్రామంలో దారుణం జరిగింది. నకఫోడి మాఝీ అనే వ్యక్తి తన భార్యను నరికి చంపి, తలతో ఊరిలో ప్రయాణించాడు. అతడిని ఇద్దరు పిల్లలు. తన భార్యపై ఎప్పుడు అనుమానంతో ఉండేవాడు. భార్య ఎవరితో మాట్లాడిన.. అందంగా ముస్తాబైన ఆరోజు ఇంట్లో నానా హంగామా చేసేవాడు. ఈ క్రమంలో.. అతగాడు.. తన భార్యను కత్తితో నరికి చంపాడు. ఒడిశాలో (Odisha) అమానవీయ ఘటన వెలుగులోనికి వచ్చింది. ఢెంకనాల్ జిల్లాలోని చంద్రశేఖర్‌పూర్ గ్రామంలో దారుణం జరిగింది. నకఫోడి మాఝీ అనే వ్యక్తి తన భార్యను నరికి చంపి, తలతో ఊరిలో ప్రయాణించాడు. అతడిని ఇద్దరు పిల్లలు. తన భార్యపై ఎప్పుడు అనుమానంతో ఉండేవాడు. భార్య ఎవరితో మాట్లాడిన.. అందంగా ముస్తాబైన ఆరోజు ఇంట్లో నానా హంగామా చేసేవాడు. ఈ క్రమంలో.. అతగాడు.. తన భార్యను కత్తితో నరికి చంపాడు. ఆ తర్వాత.. తలను, మొండెం నుంచి వేరు చేసి, దాదాపు 12 కిలో మీటర్లు ప్రయాణం చేశాడు. అయితే, అతగాడి చేతిలో మహిళ తల ఉండటాన్ని చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోనికి దిగిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడు.. నకఫోడి మాఝీని అదుపు లోనికి తీసుకున్నారు. అతడిని అదుపు లోనికి తీసుకుని విచారించగా.. తన భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు అంగీకరించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
